ఏపీలో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ నిలిపివేస్తున్నారనే ప్రచారాన్ని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఖండించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,17,298 ఎస్సీ కుటుంబాలకు, 4,75,557 ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి చేకూరుస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం సదా కట్టుబడి ఉందన్నారు.