మంత్రి కొల్లు రవీంద్ర సోదరి కన్నుమూత

ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సోదరి నడకుదిటి శేష మల్లేశ్వరి బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మాజీ మంత్రి నడకుదిటి నరసింహరావు సతీమణి అయిన ఆమె, మంత్రి రవీంద్రకు అత్తగారు కూడా. బుధవారం మరణించిన ఆమె పార్థివదేహాన్ని మచిలీపట్నం తరలించనున్నారు. గురువారం ఉదయం సర్కిల్ పేటలోని వారి స్వగృహం నుండి అంతిమయాత్ర ప్రారంభమై, అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ వార్తతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

సంబంధిత పోస్ట్

✕
✕