AP: గత వైసీపీ హయాంలో 'ఆడుదాం ఆంధ్ర' పేరుతో ప్రజల సొమ్మును దోచుకున్నారని, వారితోనే ఆడుకున్నారని మంత్రి లోకేష్ విమర్శించారు. బుధవారం విశాఖపట్నంలో పీవీ సింధు క్రీడా ప్రాంగణానికి ఆయన భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తూ, క్రీడాకారులకు అండగా ఉంటుందని, పాఠశాల విద్య నుంచే క్రీడలపై ఆసక్తి పెంచేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం విద్యార్థులకు నాసిరకం కిట్లు ఇచ్చిందని, ప్రజల ధనాన్ని దోచుకుందని ఆరోపించారు.