మంగళగిరిలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

AP: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 86వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తమ సమస్యలపై వినతులు సమర్పించారు. బ్రెయిన్ వ్యాధితో బాధపడుతున్న తండ్రికి సీఎం సహాయనిధి ద్వారా వైద్యసాయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు, మసీదు నిర్మాణానికి సాయం, వారసత్వ భూమి ఆన్ లైన్ నమోదు వంటి విజ్ఞప్తులను మంత్రి స్వీకరించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్