నేటి నుంచి దక్షిణ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన

TG: రాష్ట్ర మంత్రి లోకేశ్‌ దక్షిణ కొరియా ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఆదివారం నుంచి ఈ నెల 11 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో అధికారిక సమావేశాల్లో పాల్గొంటారు. భారత్‌, దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఆదివారం సియోల్‌లో ఇండియా డయాస్పోరా ఆత్మీయ సమావేశానికి హాజరవుతారు. 6న టెక్‌ స్టార్టప్‌ సంస్థల ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం, పెట్టుబడి చర్చల్లో పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్