విశాఖ నుంచి రోడ్డు మార్గంలో కాశీబుగ్గకు వెళ్లనున్న మంత్రి లోకేశ్‌

AP: మంత్రి నారా లోకేశ్‌ విశాఖపట్నానికి చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో విశాఖకు వచ్చిన ఆయన, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు బయల్దేరనున్నారు. తొక్కిసలాట ఘటన చోటుచేసుకున్న ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, మృతుల కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించనున్నట్లు సమాచారం. కాశీబుగ్గ దుర్ఘటనపై ప్రభుత్వం పర్యవేక్షణను మరింత వేగవంతం చేయనుంది.

సంబంధిత పోస్ట్