శ్రీ భక్త కనకదాసు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్ (వీడియో)

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు కాంస్య విగ్రహాన్ని మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరించారు. కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం తర్వాత తొలి కార్యక్రమంగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ వేడుకకు ఉమ్మడి అనంతపురం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కనకదాసు సమానత్వం, భక్తి, మానవతా విలువలకు ప్రతీక అని, ఆయన బోధనలు నేటికీ స్ఫూర్తిదాయకమని లోకేశ్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్