AP: తెనాలి నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఉర్దూ స్కూల్ ప్రారంభించారు. మారిసుపేటలోని చెంచు రామానాయుడు హైస్కూల్ ప్రాంగణంలో సుందరీకరించిన మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. రూ.70 వేల సొంత డబ్బులతో ఉర్దూ పాఠశాలను సుందరీకరించిన పాఠశాల ఉపాధ్యాయురాలు భట్టిప్రోలు మాధవిని మంత్రి అభినందించారు. మిగతా పాఠశాలల్లో కూడా దాతల సహకారంతో సుందరీకరించాలని, ఉర్దూ పాఠశాలను మోడల్ స్కూల్‌గా ప్రతి ఒక్కరూ అందంగా తీర్చిదిద్దాలని సూచించారు.