జగన్‌కు మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్

AP: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు అద్భుతమైన మెజారిటీ ఇచ్చినప్పటికీ, ఐదేళ్ల పాలనలో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. పరిపాలన చేతకాక, పదవుల కోసం రాష్ట్ర విభజనను జగన్ ప్రోత్సహించారని, మూడు రాజధానుల నిర్ణయం తుగ్లక్ నిర్ణయం లాంటిదని విమర్శించారు. అమరావతి రైతులను జగన్ దుర్మార్గంగా అవమానించారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్