ఏపీ ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ 5 కేజీల గ్యాస్ సిలిండర్ల పంపిణీపై శుభవార్త తెలిపారు. రాష్ట్రంలో 5 కేజీల సిలిండర్లను పంపిణీ చేయాలని ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సిలిండర్లను కొనుగోలు చేస్తే సబ్సిడీ రాదు కానీ తక్కువ ధరకే లభిస్తాయి. నేరుగా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి డాక్యుమెంట్ సమర్పించి తీసుకోవచ్చు, సెక్యూరిటీ డిపాజిట్ అవసరం లేదు. రీఫిల్లింగ్ కోసం బుకింగ్ అవసరం లేదు, నేరుగా ఏజెన్సీకి వెళ్లి లేదా పెట్రోల్ బంకులు, దుకాణాల్లో నింపుకోవచ్చు.