మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యే అన్ని సమస్యల పరిష్కారానికి మార్గమని, యువత నైతిక విలువలతో ఎదగాలని అన్నారు. డిగ్రీతో చదువు ఆపకుండా జీవితాంతం నేర్చుకోవాలని, డిజిటల్ యుగంలో జ్ఞానమే గొప్ప సంపద అని తెలిపారు. యువత అధ్యాపకులు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు.