తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్

AP: రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. విశేషమైన తిరుప్పావడ సేవలో పాల్గొని, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుకున్నారు. దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలు అందజేసి సత్కరించారు.

సంబంధిత పోస్ట్