AP: రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించి అభివృద్ధి పనులు, వర్షాకాల సన్నాహకాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలతో పాటు పెనుమాక రిజర్వాయర్‌ను పరిశీలించారు. రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో వాగుల సహజ ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే వంతెనల కింద పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించాలని సూచించారు.