AP: తన స్వగ్రామం అగర్తిపాలెంలో మంత్రి నిమ్మల రామానాయుడు వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. పాలకొల్లు నుంచి 7 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లి, దారి పొడవునా ప్రజల యోగక్షేమాలపై ఆరా తీశారు. సొంత రొయ్యల చెరువులో మేత వేసి ఎదుగుదలను పరిశీలించారు. పొలంలో కూలీలతో కలిసి ట్రాక్టర్‌పై దుక్కు దున్నిన మంత్రి, సెలవు రోజున తనకు ఇష్టమైన వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. షెడ్యూల్ ప్రకారం నేడు గోదావరి డెల్టాలకు సాగు నీరు విడుదల చేయనున్నారు.