AP: ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం సందర్శించారు. రెండో సొరంగంలోకి ప్రత్యేక వాహనంలో వెళ్లి లైనింగ్ పనులు పరిశీలించారు. అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెడ్ రెగ్యులేటర్‌లో 2,200 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం 4 గ్యాంట్రీలతో రోజుకు 12 మీటర్ల లైనింగ్ పనులు జరుగుతున్నాయి.