టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్నమయ్య జిల్లాలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు మంది మార్బలంతో నియోజకవర్గాలలో తిరిగేది కాదని.. అధికారం కోల్పోయిన 8 నెలల తర్వాత ఆయన రాయచోటికి వచ్చాడని తెలిపారు. వైసీపీ వాళ్లు నీతి, నిజాయితీగా ప్రతిపక్ష పాత్ర పోషించాలని మంత్రి తెలిపారు.