మంత్రికి త‌ప్పిన ప్ర‌మాదం

ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ప్రమాదం తప్పింది. మంత్రి ప్రయాణిస్తున్న ఎస్కార్ట్ వెహికల్ టైర్ పేలడంతో ఎదురుగా వస్తున్న టాటాఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో టాటాఏస్ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. మంత్రి సంధ్యారాణి సాలూరు నుంచి మెంటాడ వస్తుండగా ఆరికతోట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్ర‌మాదంలో మంత్రికి స్వ‌ల్ప గాయాలైన‌ట్లు తెలుస్తోంది. పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్