అంగ‌న్వాడీ లోపాలపై మంత్రి సీతక్క ఫైర్

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రి సీతక్క జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు, గుడ్లు, పప్పు, నూనె, బాలమృతం, మురుకులు, బియ్యం వంటి సరుకుల సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆమె ఆదేశించారు. పలు జిల్లాల్లో సరుకుల సరఫరా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కాంట్రాక్టర్లపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని పథకాల పురోగతిని కూడా ఆమె సమీక్షించారు.

సంబంధిత పోస్ట్