ఏపీలో వరదలపై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. విజయవాడ ప్రజల కష్టాలు చూస్తే గుండె తర్కుపోతుందని అన్నారు. 'పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు. వారి కష్టాలు వర్ణనాతీతం. ఎంత మంది వరదల్లో కొట్టుకుపోయారో తెలియని పరిస్థితి. ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంత మంది ప్రాణాలు పోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదా? మంత్రులు విహార యాత్రలకు వెళ్లి ప్రజలను వరదల్లో ముంచేశారు' అని రోజా అన్నారు.