AP: అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా, అక్టోబర్ 1వ తేదీన ఉదయం బదులు మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. సచివాలయ ఉద్యోగులు బ్యాంకులకు వెళ్లి నగదును డ్రా చేసుకుని, మధ్యాహ్నం నుంచి లబ్ధిదారులకు అందజేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా లబ్ధిదారులు సహకరించాలని కోరారు.