AP: సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై 26వ వార్డుకు చెందిన 10 ముస్లిం మైనార్టీ కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో పార్టీలో చేరిన వారిని టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, వారి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల విశ్వాసంతో టీడీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.