అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 4.8 కిలోల బరువుతో శిశు జననం

అనకాపల్లి ఎన్టీఆర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది. 4.8 కిలోల బరువుతో మగ శిశువు జన్మించింది. సాధారణంగా ఇంత బరువున్న శిశువులకు శస్త్రచికిత్స అవసరమైనప్పటికీ.. వైద్యులు, సిబ్బంది సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి సహజ ప్రసవం చేయించారు. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్‌, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్