AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని శుక్రవారం కోర్టులో హాజరుపర్చనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు మిథున్ రెడ్డిని రోడ్డు మార్గంలో సిట్ అధికారులు తీసుకెళ్లారు. ఇవాళ్టితో మిథున్ రెడ్డి రిమాండ్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు.