ఏపీ మద్యం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు మిథున్ రెడ్డి బెయిల్‌పై ఆర్డర్స్ రిజర్వ్ చేసింది. కాగా, తీర్పు మిథున్‌రెడ్డికి అనుకూలంగా వస్తుందా? లేక వ్యతిరేకంగా వస్తుందా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.