వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిపై MLA ఆది ఘాటు వ్యాఖ్యలు

AP: వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "అతను చాలా అతి చేస్తున్నాడు. ఇలాగే కొనసాగితే చెప్పుతో కొడతా" అని ఆయన హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం తనపై అనేక కేసులు పెట్టినా ఏమీ చేయలేకపోయిందని, తమ కుటుంబానికి కేసులు, జైలు కొత్త కాదని, ఫ్యాక్షన్ రాజకీయాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయామని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లు అధికారంలో ఉంటుందని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్