AP: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డిసెంబర్ 3, 2025న గంజాయి స్మగ్లర్ల చేతిలో హత్యకు గురైన పెంచలయ్య గారి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వారి పిల్లల చదువుల బాధ్యతను తన కుమార్తెలతో కలిసి తీసుకుంటానని, అన్నయ్యగా భావించి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. కాగా, ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.