AP: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్థలంలో బిల్డింగ్ కట్టుకోవడానికి ఎమ్మెల్యే రూ.50 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. ఇప్పటికే రూ.10 లక్షలు ఇచ్చినట్లు టీడీపీ నేత సౌదీ రౌఫ్ తెలిపారు. ఇంకా రూ.40 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే పార్థసారథి తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపించారు. తాను డబ్బులు ఇవ్వనని చెప్పడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులను పంపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.