కష్టపడిన వారికే ఎమ్మెల్యే పదవి: చంద్రబాబు

AP: CM చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికే ఎమ్మెల్యే పదవి దక్కుతుందని వెల్లడించారు. కార్యకర్తలే దేవుళ్లని, వారిని పట్టించుకోని నేతలు తనకు అక్కర్లేదని తేల్చి చెప్పారు. టీడీపీ శ్రేణులంతా క్రమశిక్షణతో పని చేయాలని, పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. కష్టపడిన వారిని గుర్తించే పని మంత్రి నారా లోకేశ్ చూసుకుంటారని తెలిపారు. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు వ్యక్తిగత ప్రవర్తన నుంచి ప్రతి అంశంలోనూ తెలుగుదేశం బ్రాండ్ నిలిపేలా వ్యవహరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్