అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ సిద్ధం: చంద్రబాబు

AP: అమరావతి రాజధానిలో అత్యాధునికంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్ సిద్ధమయ్యాయి. రాయపూడి వద్ద 12 టవర్లలో 288 ఫ్లాట్లతో ఈ భవన సముదాయం నిర్మించబడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ క్వార్టర్స్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రాజధానికి కొత్త హంగులు వచ్చాయని, ప్రజా ప్రతినిధుల కష్టాలు తీరాయని ఆయన అన్నారు. అలాగే, సీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జిలను కూడా ఆయన ప్రారంభించారు. అమరావతిని కాలుష్య రహిత, డీప్‌టెక్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతామని, ఇది రాష్ట్రాభివృద్ధిలో మొదటి మెట్టని చంద్రబాబు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్