టోల్‌ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి

AP: టోల్‌ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె-తిరుపతి జాతీయ రహదారిపై గండబోయినపల్లె వద్ధ చోటు చేసుకుంది. టోల్ ప్లాజా సిబ్బందిపై అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా.. టోల్‌గేట్ వద్ద సిబ్బంది టోల్‌ఫీజు చెల్లించాలని కోరారు. ‘ఎమ్మెల్యే వాహనాలను ఆపుతారా’ అంటూ అనుచరులు రెచ్చిపోయారు.

సంబంధిత పోస్ట్