AP: భవానీపురం 42 నిర్మాణాలపై ఎమ్మెల్యే సుజనాచౌదరి స్పందించారు. జోజినగర్ బాధితుల విషయం తన దృష్టికి ముందే వచ్చిందని, ఇది సివిల్ వివాదం కావడంతో కోర్టుకు వెళ్లమని చెప్పినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలతోనే తొలగింపులు జరిగాయని, బాధితులకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్నామని, మానవత్వంతో స్పందిస్తున్నామని పేర్కొన్నారు. ముగ్గురు సభ్యుల కమిటీ వేసి సమస్యను పరిష్కరిస్తామని, ఫేక్ సొసైటీపై విచారణ జరపాలని చెప్పామని, వచ్చే శుక్రవారం లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు.