AP: వైసీపీ సోషల్ మీడియా వింగ్‌తో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైసీపీ అండగా ఉంటుందని, వారి కృషి ప్రశంసనీయమని ఆయన అన్నారు. వైసీపీ సోషల్ మీడియా చాలా బలంగా ఉందని, కూటమి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని, ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశం ద్వారా వైసీపీ తన సోషల్ మీడియా వ్యూహాలను మరింత పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేసింది.