AP: ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం జైలులో అప్పిరెడ్డిని అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘రెండేళ్లుగా లేళ్ళ అప్పిరెడ్డిని జైలుకు పంపాలని చంద్రబాబు, లోకేశ్, పెమ్మసాని తీవ్రంగా ప్రయత్నించి.. మొన్న వెంగలాయపాలెం ఎన్నికల బ్యాలెట్ బాక్స్ ఇష్యూలో ఎలాంటి తప్పు లేకపోయినా అరెస్ట్ చేశారు. అసలు ఆరోజు బ్యాలెట్ బాక్స్‌ను ఎందుకు బస్సులో నుంచి దించారో ఎన్నికల కమిషన్ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.