AP: MLCల రాజీనామాల వ్యవహారంలో చివరి నిమిషంలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. రాజీనామాలు ఆమోదించాలని YCP ఎమ్మెల్సీలు మండలి చైర్మన్‌ను కలిసి కోరిన విషయం తెలిసిందే. అయితే లాస్ట్ మినిట్‌లో మండలి వైస్ చైర్‌పర్సన్ జాకియా ఖానం మాత్రం తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు చైర్మన్‌కు తెలిపారు. ఇదే సమయంలో ఉదయం రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్సీలు, పూర్తిగా స్వచ్ఛందంగానే రాజీనామాలు చేశామని, ఎలాంటి ఒత్తిడి లేదని చైర్మన్‌కు సమాధానమిచ్చారు. కాగా, జాకియా ఖానం యూటర్న్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.