ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మన్యం, అల్లూరి, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించారు. అటు బాపట్ల, పల్నాడు, మర్కాపురం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్