AP: రైతులు తమ ధాన్యాన్ని నచ్చిన రైస్ మిల్లుకు అమ్ముకునే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆదివారం పాలకొల్లులో రూ.1.98 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో 10.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని మంత్రి చెప్పారు.