రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి చెల్లించాల్సిన బకాయిలు మరో 15 రోజుల్లో అకౌంట్లలోకి జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో తెలిపారు. గత ప్రభుత్వం మొత్తం రూ.1674.40 కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. రైతుల ఇబ్బందులు గుర్తించి ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు చెల్లించామని, మరో రూ.674.40 కోట్లు త్వరలో అకౌంట్లలోకి జమ చేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.