AP: వైసీపీ హయాంలో రాష్ట్ర ఖజానా, ఆస్తులను ఆ పార్టీ నేతలు దోచుకున్నారని డీటీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. మద్యం కుంభకోణంలో భారీగా అవినీతి జరిగిందని ఆయన చెప్పారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో దోచుకున్న సొమ్మును రికవరీ చేసి పేదలకు పంచాలన్నారు. ఎవరు చేసిన తప్పులకు వాళ్లే పతనమవుతారని అన్నారు.