AP: అరకు లోయలో సరికొత్తగా మంకీ కాఫీ ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టంట్, ఫిల్టర్ కాఫీలకు భిన్నంగా అరకులో ఈ కాఫీ వైరలవుతోంది. దాంతో ఈ కాఫీకి భారీ డిమాండ్ ఏర్పడింది. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, కాఫీ ప్రియులు దీన్ని కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మంకీ కాఫీని కొనుగోలు చేస్తున్నారు.