మొంథా ఎఫెక్ట్.. పలు విమాన సర్వీసులు రద్దు

AP: మొంథా తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే రైల్వే అధికారులు సుమారు 100 రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పలు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. విజయవాడ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించే విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీ వెళ్లే విమానాలు మినహా.. మిగిలిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రద్దు చేశారు. విశాఖ నుంచి వెళ్లే ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు కూడా రద్దు చేశారు.

సంబంధిత పోస్ట్