AP: మొంథా తుఫాన్ ప్రభావంతో అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. భోగాపురం ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా శారదా నది ఉగ్రరూపం దాల్చింది. తాచేరు, బొడ్డేరు, పెద్దేరు కలయికతో నీటి ప్రవాహం పెరగడంతో గట్టు పెద్దఎత్తున కోతకు గురైంది. గట్టు మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికులు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో వరద ప్రవాహానికి వాగులు, వంకలు పోటెత్తాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.