AP: అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీలో 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం యూనివర్సిటీలో ప్రవేశాలు జరగడంతో ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుని హాస్టళ్లలో ఉంటున్నారు. అయితే వారికి స్థానిక వాతావరణం పడకపోవడంతో జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. దీంతో వారిని అనంతపురం తరలించి చికిత్స అందిస్తున్నారు.