AP: తూర్పుగోదావరి జిల్లాలోని దోసకాయలపల్లి జీఎస్హెచ్ హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైసీపీ తెలిపింది. శనివారం ఉదయం టిఫిన్ తిన్న విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు వచ్చాయని, విషయం బయటికి రానివ్వకుండా హాస్టల్లోనే 40 మంది విద్యార్థులకు అధికారులు చికిత్స అందించారని పేర్కొంది. కానీ, ఒక విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని వెల్లడించింది. పేద విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా? సంక్షేమ హాస్టళ్లలో ఏం జరుగుతోందని సీఎం చంద్రబాబును వైసీపీ ప్రశ్నించింది.