కుమార్తె నామినేషన్ పత్రాలు చించిన తల్లి

AP: సర్పంచ్ పదవికి నామినేషన్ వేసేందుకు వచ్చిన కుమార్తెను అడ్డుకుని ఆమె చేతిలోని పత్రాలను తల్లి చించివేసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా పెట్లూరు కేంద్రం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. కొండపి మండలం చిన్నకండ్లగుంట పంచాయతీ సర్పంచ్ పదవికి నామినేషన్ వేసేందుకు తాటాకులపాలెం గ్రామానికి చెందిన చాగంరెడ్డి మాధురి సంబంధిత పత్రాలతో కేంద్రం వద్దకు చేరుకుంది. ఆమె తల్లి విజయలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. తన ఉద్యోగానికి ఇబ్బంది కలుగుతుందేమోనన్న భయంతో మాధరి నామినేషన్ పత్రాలను చించివేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕