AP: పల్నాడు జిల్లా కొండవీడులో మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగింది. మోటోస్ట్రామ్ ఆధ్వర్యంలో కొండవీడు ఘాట్ రోడ్డులో 'మోటోస్ట్రామ్ వైల్డ్ వైల్డ్ హిల్ క్లైంబ్ రేస్' పేరిట మోటార్ స్పోర్ట్స్ పోటీలు నిర్వహించారు. రెండో రోజు జరిగే ఈ పోటీల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బైక్ రైడర్లు, కారు డ్రైవర్లు పాల్గొన్నారు. కొండపైకి వెళ్లే ఎత్తైన మార్గాల్లో నిర్ణీత దూరాన్ని అత్యంత వేగంగా ఎక్కడమే ఈ పోటీ. పోటీలను చూడటానికి వచ్చే సందర్శకుల వాహనాలను ఘాట్ రోడ్డు చెక్ పోస్టు వరకే అనుమతించారు.