AP: బీటెక్ రవి పులివెందుల ప్రజలకు కన్నం వేశారని, బైరెటీస్ డంపులను అక్రమంగా అమ్ముకున్నారని, ముగ్గురాయిని తవ్వుకుని దోచుకున్నారని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు టన్నుల బైరెటీస్ దోచుకున్నా కేసు పెట్టలేదని, బీటెక్ రవిని చట్టం ముందు నిలబెడతామని ఆయన అన్నారు. ఉల్లిమెల్ల తోటకు బీటెక్ రవి ఎందుకొచ్చాడో చెప్పాలని, ఎంపీటీసీ పదవి కోసం ఒక ప్రతిపాదనతో వచ్చాడని, ఎన్నికల తర్వాత వైసీపీలో చేరాలనుకున్నాడని వ్యాఖ్యానించారు.