ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి

కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి సోమవారం ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని సందర్శించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాముని జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ఒంటిమిట్ట రైల్వే స్టేషన్‌లో ప్రతి రైలు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రిని పలుమార్లు కలిసి వినతిపత్రం అందించినట్లు తెలిపారు. ఒంటిమిట్ట కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటైతే బాగుంటుందని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్