నేడు 659 మండలాల్లో MPP ఎన్నికలు

AP: రాష్ట్రంలో కొత్త మండల పరిషత్ అధ్యక్షులు (MPP), ఉపాధ్యక్షుల ఎన్నికలు నేడు జరగనున్నాయి. మొత్తం 659 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఈ నెల 10న షెడ్యూల్ విడుదల చేసింది. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు కో-ఆప్షన్ సభ్యుల నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, ఒంటి గంటకు ఉపసంహరణ ప్రక్రియ నిర్వహిస్తారు. అనంతరం MPTC సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక చేతులెత్తే పద్ధతిలో MPP, వైస్ MPPల ఎన్నిక చేపడతారు. రేపు జెడ్పీ ఛైర్‌పర్సన్ల ఎన్నిక జరగనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕