ఏపీలో మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాల్లో 21,012 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31,460 పోలింగ్ కేంద్రాల్లో 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే, నామినేషన్లు వేయనందున వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగనుంది.