AP: రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) బుధవారం కీలక ప్రకటన చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీని రీషెడ్యూల్ చేసింది. నవంబర్ 3న జరగాల్సిన పోలింగ్ 5వ తేదీకి, ఓట్ల లెక్కింపు 5 నుంచి 7వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 3వ తేదీన పరిషత్ ఎన్నికల పోలింగ్, పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ పరంగా తలెత్తే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.